మిత్రులారా,
నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో గత ఆరేళ్లుగా భవననిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. విద్యార్ధలు బెంచిలు లేక నేలపై కూర్చోవలసివస్తుంది. కరెంటు,ఫ్యాన్స్ సమస్య కూడా ఉన్నది. ఈ సమస్యల పరిష్కారానికై మన పూర్వవిద్యార్ధులు నాగసరపు.నరసింహారావు,మేకల.నాగేశ్వరరరావు గతంలో లోక్ సత్తా వారి సహకారంతో, హైస్కూల్ ను పత్రికావిలేఖరులతో సహా సందర్శించి , ప్రస్తుత హెడ్ మిసెస్. జ్యోతి మేడమ్ తో మాట్లాడి సమస్యలన్నిటినీ పత్రికాముఖంగా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కృషిలో భాగంగా డిసెంబర్ 27నాడు ఎం.ఆర్.ఓ వద్ద గ్రీవెన్స్ సెల్ లో సమస్యలన్నిటినీ రికార్డు చేయించడం జరిగింది. అదేరోజు సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ను కలిసి సమన్యల పరిష్కారానికి హామి పొందడం జరిగింది. కమిషనర్ వాగ్ధానం మేరకు ఎలక్ట్రిసిటి , ఫ్యాన్స్ పనులు సత్వరమే చేయిస్తామన్నారు. ప్రతినిధుల సమక్షంలోనే భవననిర్మాణ కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. జనవరి,2011 లోగా భవన నిర్మాణ పనులు పూర్తిగావించి అప్పగిస్తామని కమిషనర్ హామినిచ్చారు. అలాగే పెండింగ్ లో ఉన్న పూర్తిస్థాయి(పర్మనెంట్) హెడ్ మాస్టర్ నియామకం కూడా వెంటనే చేపడతామని కమిషనర్ మన ప్రతినిధులు నరసింహారావు, నాగేశ్వరరావు, ఇతర లోక్ సత్తా కమిటి సభ్యులకు హామినిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి