26, జనవరి 2012, గురువారం

రిపబ్లిక్ డే సందర్భంగా పేదవిద్యార్ధులకు NRT84-85 పూర్వవిద్యార్ధుల వితరణ

మిత్రులారా, 


నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో నేడు జరిగిన రిపబ్లిక్  డే ఉత్సవాల సందర్భంగా మన ఈ బ్లాగ్ రూపకర్తలైన NRT 84-85 బ్యాచ్  పదవతరగతి పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో పేదవిద్యార్ధులకు ఆర్ధికసహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అయిదుగురు పేదవిద్యార్ధులకు ఒక్కొక్కరికి 1000/- చొప్పున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులు నాగసరపు.నర్సింహారావు, భాస్కర్, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, అరవపల్లి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు హెడ్ మాస్టర్ మహబూబ్ గారు అద్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా మాజీ హెడ్ మిసెస్  లక్ష్మి మేడమ్ హాజరయ్యారు. 
 ఇదే NRT 84-85 బ్యాచ్ సిల్వర్ జూబ్లి సందర్భంగా 2010 డిసెంబర్ లో క్లాస్ రూమ్స్ లో విద్యార్ధులకై 5బెంచిలు బహుకరించడం  జరిగింది. ఇదే బ్యాచ్ కు చెందిన దండమూరి.రాము అనే పూర్వవిద్యార్ధి తనవంతుగా మెరిట్ విద్యార్ధులకు ఆర్ధిక ప్రోత్సాహం అందచేయడం జరిగింది. ఇంతే కాకుండా  మున్సిపల్ హైస్కూల్ సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తూ,  పేట మున్సిపల్ ఆఫీస్ సెంటర్ వరకూ ప్రదర్శన నిర్వహించి, గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చివుండటం మీకు గుర్తుండే వుంటుంది. తర్వాత కూడా, మున్సిపల్ కమిషనర్ ను కలిసి సమస్యల సత్వర పరిష్కారానికై చర్యలు తీసుకోవాలని కోరుతూ, బిల్డింగ్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. ఈ కృషి  ఫలితంగా  అప్పటికి ఆరేండ్లుగా నత్తనడక నడుస్తున్న మున్సిపల్ హైస్కూల్ భవన నిర్మాణం వేగం గా పూర్తికావడం మనందరికీ సంతోషదాయకం. అలాగే ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారుల అవసరాల నిమిత్తం మున్సిపల్ హైస్కూల్లో కొత్తగా స్టాఫ్ రూమ్స్ నిమిత్తం కట్టిన గదుల్ని  వారికి కేటాయించుకోవాలని చూసినప్పుడు కూడా అది  జరుగకుండా పత్రికాపరమైన నిరసనలు, విజ్ఞప్తులు అందజేయడం ద్వారా ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడం జరిగింది. 

            
                                  
రిపబ్లిక్ డే  ఉత్సవాలలో 
వేదికపైనున్న లక్ష్మి టీచర్, మహబూబ్ మాస్టారు
NRT 84-85 విద్యార్ధులు   మేకల.నాగేశ్వరరావు, నాగసరపు.నర్సింహారావు,జుజ్జూరి.రామకృష్ణ,అరవపల్లి.శ్రీనివాసరావు

                                             
ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్న పూర్వవిద్యార్ధులు
నాగసరపు.నర్సింహారావు, భాస్కర్ తదితరులు


                                                     

24, జనవరి 2012, మంగళవారం

ఏప్రిల్ 10,2011 నాటి 80-81 బ్యాచ్ పూర్వవిద్యార్ధుల సమ్మేళన ఫోటోలు

మిత్రులారా,
ఈ బ్లాగ్ ప్రారంభించబడిన అనంతరం  జరిగిన నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధుల సమ్మేళనాల్లో అందరికంటే సీనియర్స్ అయిన 1980-81 పదవతరగతి బ్యాచ్ విద్యార్ధుల మీట్ ది.10-04-2011 నాడు వైభవంగా జరిగింది. కానీ సకాలంలో వారి ఫోటోలు అందకపోవడం వల్ల నాటి మీటింగ్  తాలుకు ఫోటోలు ఈ బ్లాగ్ లో ప్రచురించలేకపోయాము. ఈ క్రింది ఫోటోల్లో నాటి మీటింగ్ విశేషాలు చూడగలరు. 1980-81 batch కి చెందిన  దండే.ప్రకాష్ కుమార్(9490020709 begin_of_the_skype_highlighting            9490020709      end_of_the_skype_highlighting),వి.జగన్నాధ్ (8121037019), బొమ్మిరెడ్డి.శ్రీనివాసరెడ్డి( 8019622876 begin_of_the_skype_highlighting            8019622876      end_of_the_skype_highlighting, అత్తులూరి.వెంకటేశ్వర్లు(            9248900626 begin_of_the_skype_highlighting            9248900626      end_of_the_skype_highlighting      ), కరసల. రామక్రిష్ణ(            9492473066 begin_of_the_skype_highlighting            9492473066      end_of_the_skype_highlighting      ), సయ్యద్ .బజాన్(            9296704299 begin_of_the_skype_highlighting            9296704299      end_of_the_skype_highlighting      ) తదితరులు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. జవహర్ లాల్ శర్మ గారు ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా సమన్వయం చేశారు.  ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, బయోడేటా బుక్ వంటి వివరాల కోసం ఇక్కడ పొందుపర్చిన నిర్వాహకులను సంప్రదించగలరు. 
ఇంకొక్క విశేషమేమిటంటే ఇదే బ్యాచ్ విద్యార్ధులు ఇప్పుడు మన నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్  CENTENARY  CELEBRATIONS (నిజానికి మన హైస్కూల్ స్ధాపించబడి 100 సం.లు దాటిపోయింది, కానీ మన ఈ చారిత్రక స్కూల్ శతవార్షిక ఉత్సవాలు ఇప్పటికైనా జరపడం మనందరికీ హర్షణీయమే కదా!) జరుపుదామని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అలాంటి ఆలోచన మనందరికీ గర్వకారణం. మన నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ శతవార్షికోత్సవాలు జరగాలని, జరిపేందుకు అందరూ తమతమ అభిప్రాయాలు ఈ బ్లాగ్ లో  లేదా సంబధిత బ్యాచ్ ల నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి సమన్వయం చేసుకోవల్సిందిగా విజ్ఞప్తి.
















                                  
                                   

                                     

23, జనవరి 2012, సోమవారం

nrt 85 పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే నాడు పేదవిద్యార్ధులకు సహాయం

మిత్రులారా,


మన ఈ "నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక" బ్లాగ్  ఆవిర్భావానికి నాంది పలికిన 84-85 పదవతరగతి  పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రిపబ్లిక్ డే జనవరి 26 నాడు పేదవిద్యార్ధులకు ఆర్ధిక సహాయం చేయనున్నాము. దీనిగురించి మన మిత్రులు నాగసరపు.నర్సింహారావు, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, అరవపల్లి.శ్రీనివాసరావు తదితరులు మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ మహబూబ్ గారిని కలవగా ఆయన  హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు గుర్తించిన పేద విద్యార్ధులకు తగిన రూపంలో ఆర్ధిక సహాయం చేయాలని నిర్ణయించారు. ఇందుకై ఈ విడతలో రూ.5000 సహాయాన్ని అందజేయనున్నారు.