29, జులై 2013, సోమవారం

విజయవంతంగా జరిగిన nrt85 పూర్వవిద్యార్ధుల ద్వితీయ సమావేశం

మిత్రులారా,
ఈ వేదికను ప్రారంభించిన నరసరావుపేట 1984-85  పదవతరగతి పూర్వ విద్యార్ధుల ద్వితీయ సమ్మేళనం
ది.28-07-2013(ఆదివారం) నాడు సాతులూరు వద్దనున్న స్ధానిక అమరా ఇంజనీరింగ్ కాలేజిలో జయప్రదంగా జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 100 మందికి పైగా విచ్చేశారు. గతంలో జరిపిన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. భవిష్యత్ లో  "nrt85 charitable trust " పేరిట ఒక అకౌంట్ ఓపెన్ చేసి, కనీసం 1 లక్ష రూపాయలతో కార్పస్ ఫండ్ ప్రారంభించి, దాన్ని క్రమేణా సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసి, తగిన విధమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు కొంతమంది అక్కడికక్కడే  డొనేషన్స్ ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 3వ వారంలో ఉచిత మధుమేహ వ్యాధి స్క్రీనింగ్ మరియు చికిత్సా శిబిరం ఈ వేదిక తరపున నిర్వహించాలని నిర్ణయమైనది. అలాగే ఈ వేదిక తరపున రెగ్యులర్ గా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ వేదికలో సభ్యులైన పలువురు తమ తమ రంగాల్లో తాము అందించగల సహాయసహకారాల గురించి వివరించారు. ఈ సమావేశానికి హాజరైన వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, తాజాపర్చబడిన ఇ-మెయిల్ ఐడిలు, ఈ సమావేశం తాలుకూ పూర్తి ఫోటోలు త్వరలో పోస్ట్ చేయబడతాయి.
ఈ సమావేశానికి  స్ధానికంగానూ, ఇతర జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి సైతం విచ్చేసిన మిత్రులందరికీ ఈ వేదిక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నది. సమావేశం గురించి  పత్రికలలో వార్తలు క్రింద చూడగలరు.
 
 
 

13, జులై 2013, శనివారం

28-07-2013 న 84-85 మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధుల 2013 వార్షిక సమావేశం

                                            
మిత్రులారా,


ఈ బ్లాగ్ రూపకర్తలైన నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ 84-85 పదవతరగతి పూర్వవిద్యార్ధుల 2013 వార్షిక సమావేశం ఈ నెల 28న (ఆదివారం) నరసరావుపేట పట్టణం సమీపంలోని సాతులూరు గ్రామపరిధిలోని శ్రీ అమరా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం లో జరుగనుంది. ఈ సమావేశంలో గతంలో ఈ వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల గురించి సమీక్ష చేయబడుతుంది మరియు  పూర్వవిద్యార్ధుల స్ధితిగతులు, మున్సిపల్ హైస్కూల్ కు సంబంధించిన మరియు పట్టణంలో ప్రధానమైన ప్రజాసమస్యల పట్ల  చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించబడతుంది. ఈ సమావేశం గురించి ఇప్పటికే దాదాపు అందరికీ ఎస్.ఎం.ఎస్ ద్వారా మరియు స్ధానికులకు మౌఖికంగా గూడా తెలియజేయబడింది. మరోసారి కూడా అందరికీ ఫోన్ ద్వారా  కమ్యూనికేట్ చేయడానికి స్ధానిక బాధ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్ట్ ను కూడా ఆహ్వానంగా భావించి మిత్రులందరూ హాజరు కావల్సిందిగా కోరుతున్నాము. వివరాలకు నాగసరపు.నర్సింహారావు 9246453353  , గొడవర్తి.తిరుమలేష్ 9440434223 లను సంప్రదించగలరు. మీరు ఈ సమావేశంలో చర్చించబోయే విషయాల గురించి మీ స్పందన కూడా తెలియజేయగలరని విజ్ఞప్తి.