3, మార్చి 2013, ఆదివారం

గురజాడ కళామందిరం ప్రాంగణానికి పూర్వవైభవం

మిత్రులారా,

నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో  గురజాడ కళామందిరానికి ముందరి ఆవరణలో  ప్రహరీ గోడ నిర్మించ తలపెట్టిన విషయం మీకందరికీ ఎరుకే. కొన్ని రోజుల క్రితం ఈ సంఘటన జరిగినప్పుడు చారిత్రాత్మక మైదానాన్ని విడదీయవద్దని  ఈ వేదిక తరపున ప్రజాసంఘాలను కలుపుకుని కమీషనర్ కు విజ్ఞప్తి చేయడం, పత్రికాముఖంగా నిరసన తెలపడం జరిగింది. ఫలితంగా ఆ పని నిలిపివేయడం జరిగింది. తాజాగా , మైదానంలో తవ్విన గుంతల్ని పూడ్చి మరలా పాతవైభవాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విషయం మనందరికీ సంతోషదాయకం.  అంతే కాకుండా 27-02-2013(గురువారం) నాడు పునరుద్దరించబడ్డ  ఈ చారిత్రాత్మక మైదానంలో జరిగిన ధార్మిక కార్యక్రమంలో వేలాదిమంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ భారతి తీర్ధస్వామి పాల్గొన్నారు. క్రింది ఫోటోల్లో విశేషాలు చూడగలరు.