30, డిసెంబర్ 2013, సోమవారం

మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్ధులకు "పరీక్షలపై అవగాహన" సెమినార్

మిత్రులారా,

నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్ధులకు "Do's n Dont's for X class exams" అన్న అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ NRT85 10వతరగతి పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ది.28-12-2013(శనివారం) ఉదయ 10గం.లకు హైస్కూల్లో కంప్యూటర్స్ క్లాస్ రూమ్ లో హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారి అద్యక్షతన ఈ పవర్ పాయింట్ సెమినార్ జరిగింది.  దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ ప్రెజెంటేషన్ లో పరీక్షల సమయంలో ఎదురయ్యే యాంగ్జైటి, భయం లాంటి అంశాల గురించి శాస్త్రీయంగా వివరించడం జరిగింది. ఏకాగ్రత సాధనకు అవసరమైన టెక్నిక్స్ , ప్రాక్టీస్ గైడ్ లైన్స్ వివరించడం జరిగింది. జ్ఞాపకశక్తి పెంపుదలకై పాటించదగ్గ టెక్నిక్స్ వివరించడం జరిగింది. పరీక్షలను  సులువుగా ఎదుర్కోడానికి అనుసరించాల్సిన ప్రణాళిక, టైం మెనేజ్ మెంట్ టెక్నిక్స్ కూడా వివరించడం జరిగింది. పరీక్షల రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్ష హాల్లో పాటించాల్సిన అంశాలు వంటివి కూడా ఈ ప్రెజంటేషన్లో వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు, టీచర్లు శ్రీ.టి.మధుసూధనమూర్తిగారు, శ్రీ.ఒ.సాంబయ్య గారు పాల్గొన్నారు. పూర్వవిద్యార్ధులవేదిక నుండి డా.కె.శివబాబు, నాగసరపు.నర్సింహారావు,జుజ్జూరి.రామకృష్ణ,శాఖమూరి.రాంబాబు పాల్గొన్నారు. 
ఫోటోలు , ప్రెస్ క్లిప్పింగ్స్ క్రింద ఇవ్వబడ్డాయి.
                        
               
                
                 



25, నవంబర్ 2013, సోమవారం

nrt85 పదవతరగతి పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో "విజయవంతంగా జరిగిన ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్"-650మందికి పైగా హాజరైన ప్రజలు


నవంబర్ 24 (ఆదివారం) ఉదయం 6గం.ల నుండి మధ్యాహ్నం 3గం.ల వరకు నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్ విజయవంతమైంది. ఉదయం 6గం.ల నుండే  వచ్చిన ప్రజలకు గ్లూకోమీటర్ సహాయంతో రక్తంలో షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. దాదాపు 8మంది ల్యాబ్ టెక్నిషియన్లు, 4గురు నర్సులు, ఇద్దరు డాక్టర్లు, 20మందికి పైగా nrt85 పూర్వవిద్యార్ధుల వేదిక సభ్యులు , స్వచ్చందంగా వచ్చి సేవలందించిన కొద్దిమంది సీనియర్ సిటిజన్స్/పెన్షనర్స్ సంఘం సభ్యులు .. ఇలాంటి ఎంతోమంది సమిష్టి కృషితో 650మందికి పైగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు ఆదివారం నాడు ఉచితంగా రక్తంలో షుగర్ పరీక్షలు పరగడపున మరియు భోజనానంతరం నిర్వహించడం జరిగింది. షుగర్ వ్యాధి వున్నవారందరికీ ఉచితంగా మందులు కూడా పంపిణీచేయడం జరిగింది. షుగర్ వ్యాధిలో పాటించాల్సిన ఆహార నియమాలు, వ్యాయామం , కాంప్లికేషన్స్ నివారణ వంటి పలు అంశాలగురించి  అవగాహన కలిగేలా వివరాలతో ప్రచురించిన బుక్ లెట్స్ హాజరైన వారందరికీ పంపిణి చేయడం జరిగింది. షుగర్ వ్యాధి గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సులో  200మందికి పైగా శ్రోతలు పాల్గొని , ఆద్యంతం ఆసక్తిగా విని, తమ సందేహాలను కూడా అడిగి నివృత్తి చేసుకున్నారు. అవసరమైనవారికి పాదాల్లో న్యూరోపతి ని గుర్తించే బయోధీసియోమెట్రీ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో డా.కె.శివబాబు, డా.ఎ.విజయలక్ష్మి   పేషెంట్లను పరీక్షించి, వైద్యచికిత్స అందించారు. శిబిరం నిర్వహణలో పూర్వవిద్యార్ధులు నాగసరపు.నర్సింహారావు, అరవపల్లి.శ్రీనివాసరావు, మేకల.నాగేశ్వరరావు,జుజ్జూరి.రామకృష్ణ,నూతక్కి.శ్రీనివాసరావు,గొడవర్తి,తిరుమలేశ్వరరావు,కూనిశెట్టి.సత్యసాయి, కొప్పురావూరి.అశోక్ కుమార్, మిట్టపల్లి.భాస్కర్, రెడ్డిచంద్ర,రామలింగేశ్వరరావు,జి.వి.ఎస్.ప్రసాద్,చీమకుర్తి.బదరినాధ్,గుండా.శ్రీనివాసరావు,టి.రమేష్, దేసు.శ్రీనివాసరావు,రసూల్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ బాలుర హైస్కూల్ ప్రస్తుత హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు, ఇతర టీచర్లు కూడా శిబిరం నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొని తమవంతు సహకారాన్ని అందించారు. గతంలో రెండునెలలపాటు జరిగిన సమైక్యాంధ్ర సమ్మెల ఫలితంగా ప్రస్తుతం ఆదివారం కూడా హైస్కూల్లో తరగతులు నిర్వహించబడుతున్నప్పటికీ, హెడ్ మాస్టర్ మరియు టీచర్లు , క్లాస్ రూమ్ లు సర్దుబాటు చేసి వైద్యశిబిరం నిర్వహణకు ఇబ్బంది లేకుండా సహకరించారు. 
 అంతకుముందు రోజు 23-11-2013 (శనివారం) ఉదయం నరసరావుపేట పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్ధన మేరకు nrt 85 పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో  దాదాపు 75మందికి ఉచిత డయాబెటిస్ క్యాంప్ నిర్వహించి రక్తపరీక్షలు చేసి, ఉచిత మందులు ఇవ్వడం జరిగింది.  
పూర్తి విశేషాలతో కూడిన  ఫోటోలు మరియు ప్రెస్ క్లిప్పింగ్స్ క్రింద చూడగలరు.

"మధుమేహవ్యాధి అవగాహన" పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 

హైస్కూల్ ప్రవేశద్వారం ఉదయం 6.30 గం.లకు











పరీక్షిస్తున్న వైద్యులు డా.కె.శివబాబు, డా.ఎ.విజయలక్ష్మి





మందులు పంపిణి జరిగిన రూమ్









     
 
హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారిని సన్మానిస్తున్న nrt85 పూర్వవిద్యార్ధులు





10, నవంబర్ 2013, ఆదివారం

నవంబర్ 24న NRT85 పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్

మిత్రులారా,
ఈ వేదిక గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 4వ ఆదివారం , తేది :24-11-2013 నాడు  నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నరసరావుపేట 1985 పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ మెగా క్యాంప్ జరుగనున్నది. ఈ క్యాంప్ లో ఉదయం 6గం. నుండి 9గం. వరకు పరగడపున వచ్చిన వారికి రక్తంలో షుగర్  పరీక్ష నిర్వహిస్తారు. డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలైన అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం వంటి లక్షణాలున్న వారిలో న్యూరోపతి తీవ్రత తెలుసుకునే బయోధీసియోమెట్రీ పరీక్ష ఉచితంగా చేసి రిపోర్టు ఇవ్వబడుతుంది.  అనంతరం డయాబెటాలజిస్ట్ తో కన్సల్టేషన్ ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయినవారికి వారంరోజులకు సరిపడా మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి మరియు మధుమేహం గురించి సులభరీతిలో వివరించే ఒక బుక్ లెట్  క్యాంప్ కు హాజరైన ప్రతి ఒక్కరికీ అందజేస్తారు. ఉదయం 11గం.కు డయాబెటిస్ - వ్యాధిఅవగాహన సదస్సులో మధుమేహాన్ని గురించి వివరించే పవర్ పాయింట్ వీడియో ప్రదర్శించబడుతుంది. అనంతరం డయాబెటిస్ వ్యాధి గురించిన ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.  ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ నరసరావుపేటలో ఇప్పటికే జరుగుతున్నది.  పూర్వవిద్యార్ధులు, శ్రేయోభిలాషులు తమవంతు సహాయసహకారాలందించి  క్యాంప్ జయప్రదం చేయవల్సిందిగా విజ్ఞప్తి. వివరాలకు నాగసరపు.నర్సింహారావు(9246453353),అర్వపల్లి.శ్రీనివాసరావు(9948694500),మేకల.నాగేశ్వరరావు(9491671867)
జజ్జూరి.రామకృష్ణ(9441010264),జి.వి.ఎస్.ప్రసాద్(9440240822),గొడవర్తి.తిరుమలేష్(9440434223), కొప్పురావూరి.అశోక్ (9866325267),డా.పుచ్చ.ఆనంద్(9849071750)తదితరులను సంప్రదించగలరు.

29, జులై 2013, సోమవారం

విజయవంతంగా జరిగిన nrt85 పూర్వవిద్యార్ధుల ద్వితీయ సమావేశం

మిత్రులారా,
ఈ వేదికను ప్రారంభించిన నరసరావుపేట 1984-85  పదవతరగతి పూర్వ విద్యార్ధుల ద్వితీయ సమ్మేళనం
ది.28-07-2013(ఆదివారం) నాడు సాతులూరు వద్దనున్న స్ధానిక అమరా ఇంజనీరింగ్ కాలేజిలో జయప్రదంగా జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 100 మందికి పైగా విచ్చేశారు. గతంలో జరిపిన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. భవిష్యత్ లో  "nrt85 charitable trust " పేరిట ఒక అకౌంట్ ఓపెన్ చేసి, కనీసం 1 లక్ష రూపాయలతో కార్పస్ ఫండ్ ప్రారంభించి, దాన్ని క్రమేణా సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసి, తగిన విధమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు కొంతమంది అక్కడికక్కడే  డొనేషన్స్ ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 3వ వారంలో ఉచిత మధుమేహ వ్యాధి స్క్రీనింగ్ మరియు చికిత్సా శిబిరం ఈ వేదిక తరపున నిర్వహించాలని నిర్ణయమైనది. అలాగే ఈ వేదిక తరపున రెగ్యులర్ గా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ వేదికలో సభ్యులైన పలువురు తమ తమ రంగాల్లో తాము అందించగల సహాయసహకారాల గురించి వివరించారు. ఈ సమావేశానికి హాజరైన వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, తాజాపర్చబడిన ఇ-మెయిల్ ఐడిలు, ఈ సమావేశం తాలుకూ పూర్తి ఫోటోలు త్వరలో పోస్ట్ చేయబడతాయి.
ఈ సమావేశానికి  స్ధానికంగానూ, ఇతర జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి సైతం విచ్చేసిన మిత్రులందరికీ ఈ వేదిక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నది. సమావేశం గురించి  పత్రికలలో వార్తలు క్రింద చూడగలరు.
 
 
 

13, జులై 2013, శనివారం

28-07-2013 న 84-85 మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధుల 2013 వార్షిక సమావేశం

                                            
మిత్రులారా,


ఈ బ్లాగ్ రూపకర్తలైన నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ 84-85 పదవతరగతి పూర్వవిద్యార్ధుల 2013 వార్షిక సమావేశం ఈ నెల 28న (ఆదివారం) నరసరావుపేట పట్టణం సమీపంలోని సాతులూరు గ్రామపరిధిలోని శ్రీ అమరా ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం లో జరుగనుంది. ఈ సమావేశంలో గతంలో ఈ వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల గురించి సమీక్ష చేయబడుతుంది మరియు  పూర్వవిద్యార్ధుల స్ధితిగతులు, మున్సిపల్ హైస్కూల్ కు సంబంధించిన మరియు పట్టణంలో ప్రధానమైన ప్రజాసమస్యల పట్ల  చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించబడతుంది. ఈ సమావేశం గురించి ఇప్పటికే దాదాపు అందరికీ ఎస్.ఎం.ఎస్ ద్వారా మరియు స్ధానికులకు మౌఖికంగా గూడా తెలియజేయబడింది. మరోసారి కూడా అందరికీ ఫోన్ ద్వారా  కమ్యూనికేట్ చేయడానికి స్ధానిక బాధ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్ట్ ను కూడా ఆహ్వానంగా భావించి మిత్రులందరూ హాజరు కావల్సిందిగా కోరుతున్నాము. వివరాలకు నాగసరపు.నర్సింహారావు 9246453353  , గొడవర్తి.తిరుమలేష్ 9440434223 లను సంప్రదించగలరు. మీరు ఈ సమావేశంలో చర్చించబోయే విషయాల గురించి మీ స్పందన కూడా తెలియజేయగలరని విజ్ఞప్తి.