30, డిసెంబర్ 2013, సోమవారం

మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్ధులకు "పరీక్షలపై అవగాహన" సెమినార్

మిత్రులారా,

నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్ధులకు "Do's n Dont's for X class exams" అన్న అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ NRT85 10వతరగతి పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ది.28-12-2013(శనివారం) ఉదయ 10గం.లకు హైస్కూల్లో కంప్యూటర్స్ క్లాస్ రూమ్ లో హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారి అద్యక్షతన ఈ పవర్ పాయింట్ సెమినార్ జరిగింది.  దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ ప్రెజెంటేషన్ లో పరీక్షల సమయంలో ఎదురయ్యే యాంగ్జైటి, భయం లాంటి అంశాల గురించి శాస్త్రీయంగా వివరించడం జరిగింది. ఏకాగ్రత సాధనకు అవసరమైన టెక్నిక్స్ , ప్రాక్టీస్ గైడ్ లైన్స్ వివరించడం జరిగింది. జ్ఞాపకశక్తి పెంపుదలకై పాటించదగ్గ టెక్నిక్స్ వివరించడం జరిగింది. పరీక్షలను  సులువుగా ఎదుర్కోడానికి అనుసరించాల్సిన ప్రణాళిక, టైం మెనేజ్ మెంట్ టెక్నిక్స్ కూడా వివరించడం జరిగింది. పరీక్షల రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్ష హాల్లో పాటించాల్సిన అంశాలు వంటివి కూడా ఈ ప్రెజంటేషన్లో వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు, టీచర్లు శ్రీ.టి.మధుసూధనమూర్తిగారు, శ్రీ.ఒ.సాంబయ్య గారు పాల్గొన్నారు. పూర్వవిద్యార్ధులవేదిక నుండి డా.కె.శివబాబు, నాగసరపు.నర్సింహారావు,జుజ్జూరి.రామకృష్ణ,శాఖమూరి.రాంబాబు పాల్గొన్నారు. 
ఫోటోలు , ప్రెస్ క్లిప్పింగ్స్ క్రింద ఇవ్వబడ్డాయి.