23, జనవరి 2014, గురువారం

నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్లో ఈ-లెర్నింగ్ కేంద్రం ప్రారంభం

మున్సిపల్ హైస్కూల్ 1985-86 10వతరగతి పూర్వవిద్యార్ధులచే ఏర్పాటు కాబడ్డ "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో 22-01-2014(బుధవారం) నాడు  హైస్కూల్లో e-learning  సెంటర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ కం టాక్స్ కమీషనర్ శ్రీ.జాస్టి.కృష్ణకిషోర్ ఈ-లెర్నింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రంధాలయాన్ని నర్సరావుపేట ఆర్డిఓ శ్రీ.ఎం.శ్రీనివాసరావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా జరిగిన సభకు నేస్తం ట్రస్ట్ ప్రతినిధి మరియు పూర్వవిద్యార్ధి శ్రీ.కొత్తా.రామ్మోహన్ (అడ్వకేట్) అద్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నేస్తం ట్రస్ట్ ప్రతినిధులు శ్రీ.పి.జితేంద్ర చక్రవర్తి, లంకా.శ్రీనివాసశర్మ, సోము.వెంకటరమణ ,  మున్సిపల్ కమిషనర్ శ్రీ.ఎ.వి.వీరభద్రరావు  మరియు  హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు పాల్గొన్నారు.
ప్రెస్ కవరింగ్స్ క్రింద చూడగలరు.




20, జనవరి 2014, సోమవారం

1985-86 batch10వ తరగతి విద్యార్ధులచే మునిసిపల్ హైస్కూల్ లొ e learning centre

22-01-2014 న నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ లొ 1985-86 batch 10వ తరగతి విద్యార్ధులచే e learning centre మధ్యాన్నం 3:00 గం.లకు ప్రారంభిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే