మిత్రులారా,
ఈ వేదికను ప్రారంభించిన నరసరావుపేట 1984-85 పదవతరగతి పూర్వ విద్యార్ధుల ద్వితీయ సమ్మేళనం
ది.28-07-2013(ఆదివారం) నాడు సాతులూరు వద్దనున్న స్ధానిక అమరా ఇంజనీరింగ్ కాలేజిలో జయప్రదంగా జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 100 మందికి పైగా విచ్చేశారు. గతంలో జరిపిన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. భవిష్యత్ లో "nrt85 charitable trust " పేరిట ఒక అకౌంట్ ఓపెన్ చేసి, కనీసం 1 లక్ష రూపాయలతో కార్పస్ ఫండ్ ప్రారంభించి, దాన్ని క్రమేణా సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసి, తగిన విధమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు కొంతమంది అక్కడికక్కడే డొనేషన్స్ ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం నవంబర్ 3వ వారంలో ఉచిత మధుమేహ వ్యాధి స్క్రీనింగ్ మరియు చికిత్సా శిబిరం ఈ వేదిక తరపున నిర్వహించాలని నిర్ణయమైనది. అలాగే ఈ వేదిక తరపున రెగ్యులర్ గా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ వేదికలో సభ్యులైన పలువురు తమ తమ రంగాల్లో తాము అందించగల సహాయసహకారాల గురించి వివరించారు. ఈ సమావేశానికి హాజరైన వారి పేర్లు, ఫోన్ నెంబర్లు, తాజాపర్చబడిన ఇ-మెయిల్ ఐడిలు, ఈ సమావేశం తాలుకూ పూర్తి ఫోటోలు త్వరలో పోస్ట్ చేయబడతాయి.
ఈ సమావేశానికి స్ధానికంగానూ, ఇతర జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి సైతం విచ్చేసిన మిత్రులందరికీ ఈ వేదిక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నది. సమావేశం గురించి పత్రికలలో వార్తలు క్రింద చూడగలరు.
2 కామెంట్‌లు:
పూర్వ విద్యార్థి సమ్మేళనాలు అపూర్వ జ్ఞాపకాలను మనసుపొరల్లో అపూర్వంగా దాచుకొని అప్పుడప్పుడు వెలికితీసి చూసి మురుసుకొనే స్మ్రుతిపేటికలు!
my name is giri,10e/s rool no 20 in 1985.
i missed this program,
post pics too
thnk you all my friends.
కామెంట్‌ను పోస్ట్ చేయండి