25, నవంబర్ 2013, సోమవారం

nrt85 పదవతరగతి పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో "విజయవంతంగా జరిగిన ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్"-650మందికి పైగా హాజరైన ప్రజలు


నవంబర్ 24 (ఆదివారం) ఉదయం 6గం.ల నుండి మధ్యాహ్నం 3గం.ల వరకు నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్ విజయవంతమైంది. ఉదయం 6గం.ల నుండే  వచ్చిన ప్రజలకు గ్లూకోమీటర్ సహాయంతో రక్తంలో షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. దాదాపు 8మంది ల్యాబ్ టెక్నిషియన్లు, 4గురు నర్సులు, ఇద్దరు డాక్టర్లు, 20మందికి పైగా nrt85 పూర్వవిద్యార్ధుల వేదిక సభ్యులు , స్వచ్చందంగా వచ్చి సేవలందించిన కొద్దిమంది సీనియర్ సిటిజన్స్/పెన్షనర్స్ సంఘం సభ్యులు .. ఇలాంటి ఎంతోమంది సమిష్టి కృషితో 650మందికి పైగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు ఆదివారం నాడు ఉచితంగా రక్తంలో షుగర్ పరీక్షలు పరగడపున మరియు భోజనానంతరం నిర్వహించడం జరిగింది. షుగర్ వ్యాధి వున్నవారందరికీ ఉచితంగా మందులు కూడా పంపిణీచేయడం జరిగింది. షుగర్ వ్యాధిలో పాటించాల్సిన ఆహార నియమాలు, వ్యాయామం , కాంప్లికేషన్స్ నివారణ వంటి పలు అంశాలగురించి  అవగాహన కలిగేలా వివరాలతో ప్రచురించిన బుక్ లెట్స్ హాజరైన వారందరికీ పంపిణి చేయడం జరిగింది. షుగర్ వ్యాధి గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సులో  200మందికి పైగా శ్రోతలు పాల్గొని , ఆద్యంతం ఆసక్తిగా విని, తమ సందేహాలను కూడా అడిగి నివృత్తి చేసుకున్నారు. అవసరమైనవారికి పాదాల్లో న్యూరోపతి ని గుర్తించే బయోధీసియోమెట్రీ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో డా.కె.శివబాబు, డా.ఎ.విజయలక్ష్మి   పేషెంట్లను పరీక్షించి, వైద్యచికిత్స అందించారు. శిబిరం నిర్వహణలో పూర్వవిద్యార్ధులు నాగసరపు.నర్సింహారావు, అరవపల్లి.శ్రీనివాసరావు, మేకల.నాగేశ్వరరావు,జుజ్జూరి.రామకృష్ణ,నూతక్కి.శ్రీనివాసరావు,గొడవర్తి,తిరుమలేశ్వరరావు,కూనిశెట్టి.సత్యసాయి, కొప్పురావూరి.అశోక్ కుమార్, మిట్టపల్లి.భాస్కర్, రెడ్డిచంద్ర,రామలింగేశ్వరరావు,జి.వి.ఎస్.ప్రసాద్,చీమకుర్తి.బదరినాధ్,గుండా.శ్రీనివాసరావు,టి.రమేష్, దేసు.శ్రీనివాసరావు,రసూల్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ బాలుర హైస్కూల్ ప్రస్తుత హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు, ఇతర టీచర్లు కూడా శిబిరం నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొని తమవంతు సహకారాన్ని అందించారు. గతంలో రెండునెలలపాటు జరిగిన సమైక్యాంధ్ర సమ్మెల ఫలితంగా ప్రస్తుతం ఆదివారం కూడా హైస్కూల్లో తరగతులు నిర్వహించబడుతున్నప్పటికీ, హెడ్ మాస్టర్ మరియు టీచర్లు , క్లాస్ రూమ్ లు సర్దుబాటు చేసి వైద్యశిబిరం నిర్వహణకు ఇబ్బంది లేకుండా సహకరించారు. 
 అంతకుముందు రోజు 23-11-2013 (శనివారం) ఉదయం నరసరావుపేట పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్ధన మేరకు nrt 85 పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో  దాదాపు 75మందికి ఉచిత డయాబెటిస్ క్యాంప్ నిర్వహించి రక్తపరీక్షలు చేసి, ఉచిత మందులు ఇవ్వడం జరిగింది.  
పూర్తి విశేషాలతో కూడిన  ఫోటోలు మరియు ప్రెస్ క్లిప్పింగ్స్ క్రింద చూడగలరు.

"మధుమేహవ్యాధి అవగాహన" పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 

హైస్కూల్ ప్రవేశద్వారం ఉదయం 6.30 గం.లకు











పరీక్షిస్తున్న వైద్యులు డా.కె.శివబాబు, డా.ఎ.విజయలక్ష్మి





మందులు పంపిణి జరిగిన రూమ్









     
 
హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారిని సన్మానిస్తున్న nrt85 పూర్వవిద్యార్ధులు





3 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

డాక్టర్ శివ బాబు గారూ,

చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసినందుకు మీకు, డాక్టర్ విజయలక్ష్మి గారికి, ప్రత్యేకించి మన స్కూలు పూర్వ విద్యార్థులకు అభినందనలు!

Unknown చెప్పారు...

Dr. Siva babu & Mr. Nagasarapu Narasimharao

it is a very good programme,keep it up. hearty congratulation for one and all who accompanied either directly or in directly. i wish all the success for your spirit and motive.

kotha rama mohan, advocate, narasaraopet

Unknown చెప్పారు...

Dr. Siva Babu & Mr. Nagasarapu Narasimharao

it is a good programme, keep it up. i wish all the success for your motive and spirit.i congratulation to one and all who accoiampained either directly or in directly.
kotha ramamohan, advocate, narasaraopet