మిత్రులారా,
ఈ బ్లాగ్ ప్రారంభించబడిన అనంతరం జరిగిన నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధుల సమ్మేళనాల్లో అందరికంటే సీనియర్స్ అయిన 1980-81 పదవతరగతి బ్యాచ్ విద్యార్ధుల మీట్ ది.10-04-2011 నాడు వైభవంగా జరిగింది. కానీ సకాలంలో వారి ఫోటోలు అందకపోవడం వల్ల నాటి మీటింగ్ తాలుకు ఫోటోలు ఈ బ్లాగ్ లో ప్రచురించలేకపోయాము. ఈ క్రింది ఫోటోల్లో నాటి మీటింగ్ విశేషాలు చూడగలరు. 1980-81 batch కి చెందిన దండే.ప్రకాష్ కుమార్(9490020709 begin_of_the_skype_highlighting 9490020709 end_of_the_skype_highlighting),వి.జగన్నాధ్ (8121037019), బొమ్మిరెడ్డి.శ్రీనివాసరెడ్డి( 8019622876 begin_of_the_skype_highlighting 8019622876 end_of_the_skype_highlighting) , అత్తులూరి.వెంకటేశ్వర్లు( 9248900626 begin_of_the_skype_highlighting 9248900626 end_of_the_skype_highlighting ), కరసల. రామక్రిష్ణ( 9492473066 begin_of_the_skype_highlighting 9492473066 end_of_the_skype_highlighting ), సయ్యద్ .బజాన్( 9296704299 begin_of_the_skype_highlighting 9296704299 end_of_the_skype_highlighting ) తదితరులు కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. జవహర్ లాల్ శర్మ గారు ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, బయోడేటా బుక్ వంటి వివరాల కోసం ఇక్కడ పొందుపర్చిన నిర్వాహకులను సంప్రదించగలరు.
ఇంకొక్క విశేషమేమిటంటే ఇదే బ్యాచ్ విద్యార్ధులు ఇప్పుడు మన నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ CENTENARY CELEBRATIONS (నిజానికి మన హైస్కూల్ స్ధాపించబడి 100 సం.లు దాటిపోయింది, కానీ మన ఈ చారిత్రక స్కూల్ శతవార్షిక ఉత్సవాలు ఇప్పటికైనా జరపడం మనందరికీ హర్షణీయమే కదా!) జరుపుదామని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అలాంటి ఆలోచన మనందరికీ గర్వకారణం. మన నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ శతవార్షికోత్సవాలు జరగాలని, జరిపేందుకు అందరూ తమతమ అభిప్రాయాలు ఈ బ్లాగ్ లో లేదా సంబధిత బ్యాచ్ ల నిర్వాహకులతో సంప్రదింపులు జరిపి సమన్వయం చేసుకోవల్సిందిగా విజ్ఞప్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి