నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో నేడు జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా మన ఈ బ్లాగ్ రూపకర్తలైన NRT 84-85 బ్యాచ్ పదవతరగతి పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో పేదవిద్యార్ధులకు ఆర్ధికసహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అయిదుగురు పేదవిద్యార్ధులకు ఒక్కొక్కరికి 1000/- చొప్పున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులు నాగసరపు.నర్సింహారావు, భాస్కర్, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, అరవపల్లి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు హెడ్ మాస్టర్ మహబూబ్ గారు అద్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా మాజీ హెడ్ మిసెస్ లక్ష్మి మేడమ్ హాజరయ్యారు.
ఇదే NRT 84-85 బ్యాచ్ సిల్వర్ జూబ్లి సందర్భంగా 2010 డిసెంబర్ లో క్లాస్ రూమ్స్ లో విద్యార్ధులకై 5బెంచిలు బహుకరించడం జరిగింది. ఇదే బ్యాచ్ కు చెందిన దండమూరి.రాము అనే పూర్వవిద్యార్ధి తనవంతుగా మెరిట్ విద్యార్ధులకు ఆర్ధిక ప్రోత్సాహం అందచేయడం జరిగింది. ఇంతే కాకుండా మున్సిపల్ హైస్కూల్ సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తూ, పేట మున్సిపల్ ఆఫీస్ సెంటర్ వరకూ ప్రదర్శన నిర్వహించి, గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చివుండటం మీకు గుర్తుండే వుంటుంది. తర్వాత కూడా, మున్సిపల్ కమిషనర్ ను కలిసి సమస్యల సత్వర పరిష్కారానికై చర్యలు తీసుకోవాలని కోరుతూ, బిల్డింగ్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. ఈ కృషి ఫలితంగా అప్పటికి ఆరేండ్లుగా నత్తనడక నడుస్తున్న మున్సిపల్ హైస్కూల్ భవన నిర్మాణం వేగం గా పూర్తికావడం మనందరికీ సంతోషదాయకం. అలాగే ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారుల అవసరాల నిమిత్తం మున్సిపల్ హైస్కూల్లో కొత్తగా స్టాఫ్ రూమ్స్ నిమిత్తం కట్టిన గదుల్ని వారికి కేటాయించుకోవాలని చూసినప్పుడు కూడా అది జరుగకుండా పత్రికాపరమైన నిరసనలు, విజ్ఞప్తులు అందజేయడం ద్వారా ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడం జరిగింది.
రిపబ్లిక్ డే ఉత్సవాలలో
వేదికపైనున్న లక్ష్మి టీచర్, మహబూబ్ మాస్టారు
NRT 84-85 విద్యార్ధులు మేకల.నాగేశ్వరరావు, నాగసరపు.నర్సింహారావు,జుజ్జూరి.రామకృష్ణ,అరవపల్లి.శ్రీనివాసరావు
ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్న పూర్వవిద్యార్ధులు
నాగసరపు.నర్సింహారావు, భాస్కర్ తదితరులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి