మన ఈ "నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక" బ్లాగ్ ఆవిర్భావానికి నాంది పలికిన 84-85 పదవతరగతి పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రిపబ్లిక్ డే జనవరి 26 నాడు పేదవిద్యార్ధులకు ఆర్ధిక సహాయం చేయనున్నాము. దీనిగురించి మన మిత్రులు నాగసరపు.నర్సింహారావు, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, అరవపల్లి.శ్రీనివాసరావు తదితరులు మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ మహబూబ్ గారిని కలవగా ఆయన హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు గుర్తించిన పేద విద్యార్ధులకు తగిన రూపంలో ఆర్ధిక సహాయం చేయాలని నిర్ణయించారు. ఇందుకై ఈ విడతలో రూ.5000 సహాయాన్ని అందజేయనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి