హాయ్,
నరసరావుపేటలో డిసెంబర్ 19న సిల్వర్ జూబ్లి మీట్ రోజు ప్రారంభ వచనాల సందర్భంలో నేను ఉదహరించిన రుద్రవీణ సినిమాలోని పాట గుర్తుకొచ్చి, ఇక్కడ వ్రాస్తున్నాను. ఈపాట నాకు దైనందిన జీవితంలో ఎన్నోసార్లు గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరికీ అన్వయించుకునేందుకు చాలా బాగుంటుందనిపిస్తుంది . మాతృభూమికి, సాటి ప్రజలకు ప్రతి ఒక్కరి జీవితం ఎంతో కొంత ఉపయోగం లేదా సహాయం నిర్వర్తించాలన్న భావం ప్రతిధ్వనిస్తుంది ఇందులో.
చుట్టుపక్కల చూడర చిన్నవాడా!
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా!!
కళ్లముందు కటికనిజం కానలేని గుడ్డిజపం
సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానీయకు వ్యర్ధం
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటిమనిషి వేదన చూస్తూ జాలిలేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు- సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలిచింది
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతావా
తెప్ప తెగలబెట్టేస్తావా ఏరు దాటగానే - చుట్టుపక్కల చూడరా చిన్నవాడా... చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి