మిత్రులారా,
నరసరావుపేటలో 1985లో వివిధ స్కూల్స్ లో పదవతరగతి చదివిన విద్యార్ధులందరం 2010 డిసెంబర్ 19న సిల్వర్ జూబ్లి సమ్మేళనం జరుపుకున్నాం. ఎంతో ఉత్సాహంగా, ఉద్విగ్నంగా, సంతోషదాయకంగా జరిగిన ఈ సమ్మేళనం పల్నాడురోడ్డులోని జి.ఎస్.ఆర్.ఫంక్షన్హ హాల్ లో నిర్వహించబడింది. ఉదయం 9గం.లకే ప్రారంభమైన ఈ కోలాహలం సాయంత్రం 5గం.ల వరకూ కొనసాగింది. సుమారు 150మందికి పైగా నాటి విద్యార్ధులు విచ్చేశారు.
నాడు వివిధ స్కూల్స్ లో విద్యాబోధన గావించిన ఉపాధ్యాయులందరు కూడా విచ్చేశారు. ముందుగా గత పాతికేళ్లలో పరమపదించిన వారి స్మృత్యర్ధం సంతాపం పాటించడం జరిగింది. సిల్వర్ జూబ్లి సమ్మేళనం విశిష్టత, పూర్వాపరాల గురించి సభాద్యక్షులు డా.కె.శివబాబు వివరించారు. నాటి ఉపాధ్యాయులను పేరుపేరునా వేదికపైకి ఆహ్వానించి, వారిని ఘనంగా సన్మానించిన ప్రతినిధులు వారితో గల సంబంధ బాంధవ్యాలను, తీపిగుర్తులను నెమరువేసుకుని సంతోషపరవశులయ్యారు. మనుషుల్ని, మానవసంబంధాల్ని చులకనగా చూస్తున్న నేటి సమాజంలో పాతికేళ్లనాటి గురుతులతో కృతజ్ఞతాభావంతో ఆప్యాయంగా ఆహ్వానించి సన్మానించినందుకు ఉపాధ్యాయులందరూ ఎంతగానో సంతోషం వ్యక్తంచేశారు. అనంతరం ప్రతినిధులందరూ తమతమ పాత అనుభూతులను , ప్రస్తుత వివరాలను, భవిష్యత్ ఆకాంక్షలను వెల్లడించి పరస్పరం పరిచయకార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతినిధులందరి తరపున నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ కు 5బెంచిలు , అత్యున్నత ప్రతిభ కనబర్చిన 5మంది విద్యార్ధులకు 1,116రూ.లు బహుకరించనున్నట్లు ప్రకటించారు. సభకు రాలేకపోయిన పూర్వవిద్యార్ధి దండంరాజు.రాము తన మాతృమూర్తి జ్ఞాపకార్ధం మున్సిపల్ హైస్కూల్ లో 8,9,10 వ తరగతుల్లో ప్రతిభావంతులకు తలకో 2,000 రూ.లు బహుకరించనున్నట్లు సందేశం పంపారు. మధ్యాహ్న భోజనం అనంతరం జరిగిన సమావేశంలో భవిష్యత్తులో నరసరావుపేటలోని హైస్కూల్స్ కి, తమ తోటి మిత్రులకు చేయగల్గిన ప్రోత్సాహక, సహాయకార్యక్రమాల గురించి చర్చించారు. అనంతరం ప్రతినిధులందరూ మున్సిపల్ హైస్కూల్ కు ప్రదర్శనగా వెళ్లి సందర్శించి నాటి తమ జ్ఞాపకాలను నెమరువేసుకుని సంతోషించారు. ఇప్పటికీ మున్సిపల్ హైస్కూల్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్దనున్నమహాత్మాగాంధి విగ్రహం వరకు ప్రతినిధులందరూ ప్రదర్శన జరిపి, గాంధి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఉదయం 9గం.లకు మొదలైన కోలాహలం సాయంత్రం 5గం.ల వరకూ, ఆనందోత్సాహాలతో కొనసాగి పురప్రజలను సైతం ఎంతగానో అబ్బురపరచింది.
ఈ కార్యక్రమానికి సిల్వర్ జూబ్లి సమ్మేళన కమిటి ప్రధాన కార్యదర్శి నాగసరపు.నరసింహారావు, అద్యక్షులు చెన్నుపాటి.క్పష్ణ, కోశాధికారి గొడవర్తి.తిరుమలేశ్వరరావు, కార్యదర్శివర్గసభ్యులు కొప్పురావూరి.అశోక్,
డా.ఆనంద్, బాస్కర్, పోపూరి.కళ్యాణ్ శ్రీనివాస్, కోట.చంద్రశేఖర్, అరవపల్లి.శ్రీను, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, జి.వి.ఎస్.ప్రసాద్ మరియు ఇతర ప్రతినిధులుకేశానుపల్లి.శ్రీనివాసరావు,
పడవల.మల్లిఖార్జునరావు,హరిచరణ్,పొన్నాడ.దివాకర్,శివరాత్రి.వీరాంజనేయులు,ఎస్.ఎస్.సుధాకర్ ,కాకుమాను.సీతయ్య
కొల్లా.ఉమేష్, వి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రామిశెట్టి.శ్రీనివాసరావు, కొత్తా.శేషుకుమార్, రాజనాల.శేషు, కొత్త.నరసింహారావు, స్వర్ణ.రామిరెడ్డి, సత్యసాయి, కూనిశెట్టి.శ్రీనివాసరావు,వువ్వాడ.శివనాగేశ్వరరావు,బత్తుల.కృష్ణ, అమరా.వెంకటేశ్వరరావు, బత్తుల.కృష్ణప్రసాద్, షరీఫ్, ఏల్చూరి.నరసింహారావు, ఆర్.మాధవరావు, డి.సుందరరావు, శ్రీహరి, రవిచంద్రశేఖర్, యెక్కల.శ్రీనివాసరావు, ఎ.ఫణికుమార్, చప్పల్లి.కోటేశ్వరరావు, ఎ.వి.బదరినాధ్, ఎం.అనిల్ కుమార్, దేసు.శ్రీను, జిలాని, మండవ.ప్రసాద్, మన్మోహన్, అల్లాభక్షు, బచ్చు.రామారావు, కొత్త.సాంబశివరావు, నాగకుమార్, అచ్యుతరావు, డా.సుబ్బారెడ్డి, నూతక్కి.శ్రీనివాసరావు, డి.బాలకృష్ణారెడ్డి ......................................
.................................................హాజరయ్యారు.
( మొత్తం ప్రతినిధుల పేర్లు, మరిన్ని వివరాలు అతిత్వరలోనే ఇదే పోస్టులో సంధానించబడతాయి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి