ప్రియ మిత్రులారా,
మనందరం ప్రధానంగా నరసరావుపేట పట్టణంలో బాల్యంలో చదువుకున్నాము. ప్రస్తుతం మనలో కొందరు స్ధానికంగానూ, మరికొందరు ఎక్కడెక్కడో స్ధిరపడ్డారు. ఎక్కడున్నా బాల్యంలో అనుభవించిన మధురానుభూతులు మరచిపోలేం. అందుకే ఈ బ్లాగు ప్రారంభిస్తున్నాం. ఇందులో నరసరావుపేట పట్టణంలో చదువుకున్న అనేకమంది మిత్రులందరి ప్రస్తుత వివరాలు, నాటి అనుభూతులు, పొందుపర్చాలన్నది మా ఉద్దేశ్యం. అంతేగాక, మనలో ఆర్ధికంగా , విద్యాపరంగా ముందంజలో ఉండి, మాతృభూమికి, మిత్రులకు సహాయపడాలన్న ఉద్దేశ్యం కూడా అనేకమందికి ఉంది. అందుకే ఇలాంటి అభిప్రాయాలన్నీ పంచుకోడానికీ, అలాంటి కార్యక్రమాలలో భాగస్వాములవడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది.మీరు కూడా ఇందులో భాగస్వాములవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి