నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం నేడు ప్రారంభించబడింది. స్ధానిక ఎం.ఎల్.ఏ మరియు మంత్రివర్యులు శ్రీ కాసు.కృష్ణారెడ్డి గారు ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.పి.జ్యోతి మేడమ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ .శరత్, ఆర్.డి.ఓ.అరుణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావు, మాజీ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు శ్రీ.నాగేశ్వరరావు, ప్రసాదరావు, వసుంధరాదేవి, బాలు, అప్పారావు, ఈ వేదిక సభ్యులైన నాగసరపు.నర్సింహారావు, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, అరవపల్లి.శ్రీనివాసరావు తదితర పూర్వవిద్యార్ధులు , ఇతర పురప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి