1985-86 వ బ్యాచ్ మున్సిపల్ హైస్కూల్ పదవతరగతి పూర్వవిద్యార్ధుల పునసమ్మేళనం 24-12-2011(శనివారం) నాడు ఘనంగా జరిగింది. స్ధానిక రామిరెడ్డిపేటలోని సన్నిధి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కలయికకు 400మందికి పైగా పూర్వ విద్యార్ధులు హాజరయ్యారు. నాడు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను సన్మానించుకుని , తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎంతో ఉల్లాసంగా, ఉద్వేగంగా జరిగిన ఈ కలయికకు నాడు విద్యార్ధులుగా ఉండి నేడు సమాజంలో ప్రముఖస్ధానాల్లో ఉన్న పలువురు హాజరయ్యారు. ప్రవాస భారతీయుడు , సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నంద్యాల.కోటిరెడ్డి, సాఫ్ట్ వేర్ నిపుణులు జితేంద్ర చక్రవర్తి, చంద్రశేఖర్, వైద్యులు జి.శ్రీనివాసరావు, నీలిమ , స్టేట్ బ్యాంకు అధికారి సోము.వెంకటరమణ , ఇంకా పాలపర్తి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సమాజానికి తమవంతు సాయం తాము చేసేందుకై " నేస్తం " ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పరుస్తున్నట్లు పూర్వవిద్యార్ధుల తరపున నంద్యాల.కోటిరెడ్డి ప్రకటించారు. నరసరావుపేట పట్టణంలో తమతోపాటు చదువుకుని, నేడు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి సహాయం చేయడం, మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహించడం వంటివి ఈ ట్రస్టు చేస్తుందని వివరించారు.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను - అని శ్రీశ్రీ అన్నట్లు నరసరావుపేట పట్టణ మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధులందరూ నేడు గర్వించదగ్గ స్ధానాల్లో ఉండి, తమవంతు సాయం తాము సమాజానికి చేస్తున్నందుకు గర్విస్తూ, వారందరికీ మన ఈ బ్లాగు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి